అంతర్జాతీయం (International) వార్తలు (News)

అమెరికాలో తుఫాను ధాటికి రివర్స్​లో ప్రవహిస్తున్న మిస్సిస్సిపీ నది!!

అమెరికా ను ప్రస్తుతం హరికేన్ తుపాను అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ తుపాన్​ ధాటికి గాలులు దాదాపు 240 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అంతేకాదు ఏకంగా నదీ ప్రవాహ దిశను మార్చి వెళ్లేలా చేసింది. అవును న్యూఓర్లిన్స్ ​లో ఉన్న ఓ నది వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది. ఆ నది పేరు ఏంటంటే మిస్సిస్సిపీ.

ఇడా హరికేన్​ ప్రభావంతో గాలులు 240 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయని, దీంతో ఏ క్షణంలోనైనా విధ్వసం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గాలులు వీచడం, తుపానులు రావడం తెలిసిందే కానీ ఇలా ఓ నదీ తిరిగి రివర్స్​లో ప్రవహించడం అసాధారమైనదిగా అక్కడి వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లూసియానా లోని పోర్ట్ ఫోర్‌చాన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 4 హరికేన్ నుంచి 150 mph వేగంతో గాలులు వస్తున్నాయని నేడా హరికేన్ సెంటర్ తెలిపింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం కత్రినా హరికేన్​ విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం అంతటి ఉ ధృతిలో ఈ ఇడా హరికేన్​ వచ్చినట్లు అక్కడి నిపుణులు వెల్లడించారు.

ఆగ్నేయ లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌కు దక్షిణాన 20 మైళ్ల దూరంలో ఉన్న బెల్లె చాస్‌లో ఉన్న యుఎస్‌జీఎస్ గేజ్ వద్ద తుఫాను కారణంగా నది 7 అడుగులు పెరిగినట్లు పెర్రియన్ వెల్లడించారు. ఆ సమయంలో నది ప్రవాహం సెకనుకు 2 అడుగుల నుంచి ఇతర దిశలో సెకనుకు అర అడుగు వరకు తగ్గిపోయిందట. మొత్తం నది ప్రవాహాన్ని గేజ్ ఆపలేదని పెర్రియన్ అన్నారు. కాబట్టి నది లోపల జరిగే ఉధృతి ప్రవాహ దిశలను తిప్పికొట్టే అవకాశం ఉంది. దీంతో నదులు రివర్స్​లో పయనిస్తున్నాయట. తుఫాను సంకేతాలను ఇది సూచిస్తోంది అని ఫెర్రియన్​ అన్నారు. రాబోయే రోజుల్లో నది నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •