వార్తలు (News)

దిల్లీలో ఫ్లైఓవర్‌ పైనుంచి జలపాతం!!

దేశ రాజధాని దిల్లీలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమమై రహదారులు నదులను తలపిస్తున్నాయి. 24 గంటల్లో దిల్లీలో రికార్డు స్థాయిలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

వికాస్‌పురి ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్‌ వరదనీటితో నిండిపోవడంతో ఆ వంతెనపై నుంచి నీరు కింద ఉన్న రోడ్డుపై పడింది. ఇది అచ్చంగా జలపాతంలా కన్పిస్తుంది. దీంతో కొందరు ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

మరోవైపు రానున్న రోజుల్లోనూ దిల్లీలో వర్షాలు కురిసే అవకాశముందని, రానున్న గంటల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తూ దిల్లీ వ్యాప్తంగా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •