క్రైమ్ (Crime) వార్తలు (News)

పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన 53 మంది నైజీరియన్లు!!

దేశ రాజధాని దిల్లీలోని మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన ఘటనలో 53 మంది విదేశీయులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా వారంతా నైజీరియా దేశస్థులుగా పోలీసులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 27న కొంతమంది కర్రలు, రాళ్లతో మోహన్ గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడికి పాల్పడి.. విధ్వంసం సృష్టించిన ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో గుంపును చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపిన పోలీసులు అదే సమయంలో 8 మందిని అరెస్టు చేశారు.

అపస్మారక స్థితిలో పడి ఉన్న నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని కొందరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయకూడదని వారు వైద్యులను కోరగా వైద్య సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు వెల్లడించారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకోగానే మృతిచెందిన వ్యక్తికి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదంటూ నైజీరియన్లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, వారికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు చేరుకున్న వారంతా ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడడంతో దీనికి సంబందించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    25
    Shares
  • 25
  •  
  •  
  •  
  •