ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

క్యాన్సర్ రోగులు వేరుశనగ తినకూడదు.. ఎందుకంటే?

రోజురోజుకు క్యాన్సర్ చాప కింద నీరులా ప్రవహిస్తూ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. క్యాన్సర్ తో బాధపడే వారు పౌష్టిక ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తొందరగా క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ అధిక ప్రోటీన్లు పోషక విలువలు కలిగినటువంటి వేరుశనగపప్పు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. వేరుశనగను ఎక్కువగా తీసుకోవటం వల్ల కొన్ని దుష్పలితాలు ఉంటాయని, క్యాన్సర్ తో బాధపడే వారు వేరుశనగపప్పును అధికంగా తీసుకోవడం వల్ల మరణానికి త్వరితగతిన చేరువయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

ఇదే విషయంపై తాజా పరిశోధనలు చేసిన నిపుణులు కొన్ని సూచనలు చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందర్భరంలో వీలైనంత వరకు వేరుశనగపప్పు తినకపోవటమే మంచిది. అలా కుదరని పక్షంలో తక్కువ పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. వేరుశెనగపప్పులో అధిక మొత్తంలో అగ్లుటినిన్ అనే ప్రోటీన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొనడంతో వేరుశనగపప్పు ఆహారంగా తీసుకున్న సందర్భంలో ఈ ప్రోటీన్ మన శరీరంలో రెండు రకాల ప్రొటీన్లను విడుదల చేస్తుంది. ఈ ప్రొటీన్లు శరీరం మొత్తం వ్యాపించి క్యాన్సర్ మరింత విస్తరించటానికి కారణమౌతాయని నిపుణులు చెప్తున్నారు.

ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వేరుశనగను తీసుకోవటం వల్ల కలిగి ప్రభావాలను తెలియజేశారు. అగ్లుటినిన్ రక్తంలో కలిసి శరీరమంతా ప్రసరించి క్యాన్సర్ కణాలను తిరిగి రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరేలా చేస్తుంది. ఆక్రమంలో క్యాన్సర్ కణాలు శరీరం మొత్తం వ్యాపిస్తాయి. రోజుకు 250 గ్రాముల వేరుశెనగపప్పు తింటే క్రమేపి క్యాన్సర్ కణాలు శరీరం మొత్తం విస్తరించి త్వరగా మరణానికి చేరువ అయ్యే అవకాశాలు ఉంటాయి.

క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ కేవలం 25 నుంచి 28 గ్రాముల వేరుశనగ పప్పులు తినడం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కుం తినటం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా వేరుశనగ తింటే జీర్ణశక్తి మందగిస్తుంది. దీనిపై శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం దిశగా ముందుకు వెళుతున్నారు. రానున్న రోజుల్లో దీనిపై మరింత సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •