క్రైమ్ (Crime) వార్తలు (News)

హైటెక్ పద్ధతిలో గంజాయి సాగు!!

కర్ణాటకకు చెందిన జావెద్ అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేసి కమ్మనహళ్లి ప్రాంతంలో నివాసం ఉండేవాడు. గత మూడేళ్లగా మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ క్రమంలో గతేడాది బెంగళూరులో లాక్ డౌన్ పడింది. అదే సమయంలో బెంగళూరులో భారీ ఎత్తున మత్తు పదార్థాలు వెలుగు చూడగంతో భయపడిపోయి తాను ఉంటున్న ప్రాంతం నుంచి బిదాదికి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ రూ.35 వేల అద్దెతో ఓ విల్లాను తీసుకున్నప్పటికీ లాక్ డౌన్ కావడంతో మత్తు పదార్థాలు లభించడం కష్టంగా మారింది. అవి దొరక్కపోయే సరికి జావెద్ పిచ్చివాడిగా మారాడు.

ఆ పరిస్థితిలో అతనికి ఒక ఐడియా వచ్చింది. ఇంట్లోనే గంజాయిని పెంచాలని అనుకుని అందుకోసం ఎల్ఈడీ లైట్లను అమర్చి హైడ్రోఫోనిక్ మోడల్ ని సెటప్ చేసుకున్నాడు. తర్వాత డార్క్ వెబ్ నుంచి గంజాయి గింజలను ఆర్డర్ చేశాడు. అలా ఇంట్లో 130 మొక్కల వరకు పెంచాడు. అధునాతన పద్ధతిని ఉపయోగించి దానిని మత్తు పదార్థంగా ఉపయోగించేలా తయారు చేశాడు. వాటిని ఒక్క గ్రాము రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు విక్రయించడం ప్రారంభించాడు. అయితే రెండు రోజుల క్రితం డీజే హళ్లి ప్రాంతంలో పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి విచారించగా జావేద్ వ్యవహరం బట్టబయలైంది. జావేద్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయడంతో అక్కడ ఉన్న హైటెక్ పద్ధతిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈకేసుకు సంబంధించి పోలీసుల నలుగురు డ్రగ్ పెడ్లర్స్, ఇద్దరు ఇరానియన్లను అదుపులోకి తీసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •