వార్తలు (News)

ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్ష సూచన!

గత ఒకటిరెండు రోజులు విరామం తీసుకున్నట్లు కనిపించిన వర్షాలు మళ్ళీ విజృంభించి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు గురువారం ‘ఉపరితల ద్రోణి’ ఏర్పడింది. అది ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరప్రాంతాల వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి కొనసాగుతుంది.

ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలలో శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఆదివారంనాడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    5
    Shares
  • 5
  •  
  •  
  •  
  •