దేశవ్యాప్తంగా 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 9,765 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా తో 477 మరణాలు నమోదవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,69,724 కు చేరింది. గత 24 గంటల్లో 8,548 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 99,763 క్రియాశీల కేసులున్నాయి.