ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే! అయితే ఆయన కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తూ కిమ్స్ ఆస్పత్రిలో సిరివెన్నెల చికిత్సకు అయిన ఖర్చులను ఏపీ ప్రభుత్వం కిమ్స్ యాజమాన్యానికి చెల్లించింది. సిరివెన్నెల కుటుంబసభ్యులు ఆస్పత్రిలో కట్టిన అడ్వాన్స్ డబ్బులను కూడా వెనక్కి ఇచ్చేయాలని కిమ్స్ యాజమాన్యానికి ఏపీ ప్రభుత్వం సూచించినట్టు సమాచారం!

అంతకుముందు ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయానికి ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని నివాళులు అర్పించిన అనంతరం సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి ప్రభుత్వమే బిల్లులను చెల్లించింది.