విశాఖ జిల్లాలోని దువ్వాడ స్టేషన్‌ సమీపంలో బుధవారం రాత్రి గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం-దువ్వాడ స్టేషన్ల మధ్య రైళ్ల రాకకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి 8 రైళ్లు నిలిచిపోయాయి. దీంతో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సుమారుగా 4 గంటల తర్వాత పనులు పూర్తికావడంతో రైళ్లు యథావిధిగా ప్రయాణిస్తున్నాయి.