సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉండి అప్లై చేయాలనుకునే వాళ్ల కోసం పూర్తి నోటిఫికేషన్ వివరాలు…

భారత ప్రభుత్వానికి చెందిన ఈ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్‌లో ఉంది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. సూపర్‌వైజర్, ల్యాబరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ లాంటి పోస్టులు వున్నాయి. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 27 చివరి తేదీ గా ఉంది. వేరు వేరు పోస్టులకి వేరు వేరు అర్హతలు వున్నాయి. వాటి వివరాలను ఈ నోటిఫికేషన్ లో చూడచ్చు.

2022 జనవరి లేదా ఫిబ్రవరి లో ఆన్‌లైన్ టెస్ట్ ఉంది. అదే విధంగా ట్రేడ్ టెస్ట్ 2022 మార్చి లేదా ఏప్రిల్ లో ఉంటుంది. ఇక వయస్సు విషయానికి వస్తే 18 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉండాలి. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ముందుగా https://igmhyderabad.spmcil.com ఓపెన్ చేయాలి. ఏపోస్టు కి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Click here for New Registration పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి లాగిన్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలనివ్వాలి. రెండో స్టేజ్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. తరవాత మిగిలిన వివరాలని కూడా ఇచ్చిన తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.