దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.23 సమయంలో సెన్సెక్స్‌ 238 పాయింట్లు పెరిగి 57,923 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 17,234 వద్ద ట్రేడవుతున్నాయి. అపోలో పైప్స్‌, ఆర్‌పీఎస్‌జీ వెంచర్స్‌, జేఎంసీ ప్రాజెక్ట్స్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా షేర్ల విలువ పెరిగింది. ఇక ట్రైడెంట్‌, అవురమ్‌ ప్రాప్‌టెక్‌, త్రివేణీ టర్బైన్‌ , జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ షేర్ల విలువ తగ్గింది.