ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను సరికొత్తగా తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే! మల్టీప్లెక్స్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలలో వేరువేరుగా ధరలను నిర్ణయిస్తూ కొత్త రేట్లను ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో చూసుకుంటే మల్టీప్లెక్సు ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75, ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40 ,నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20గా ప్రకటించింది.

నగర పంచాయతీలలో మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40 ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15, నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 గా నిర్ణయించింది. గ్రామ పంచాయతీలలో మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30,ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10, నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5 గా ప్రకటించింది.

ఇక మున్సిపాలిటీ ల్లో మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60 ,ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15 గా నిర్దేశించింది.