తిరుమలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం ఉదయం కూడా ఘాట్ రోడ్డు వద్ద కొండ చరియలు, చెట్లు విరిగిపడి తిరుమల రెండో కనుమ దారి చివరి మలుపు వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంలో భారీ ప్రమాదం తప్పినప్పటికీ ఘాట్ రోడ్డు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.

వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీటీడీ అధికారులు, సిబ్బంది రోడ్డు పునరుద్దరణ పనులను ప్రారంభించారు దీంతో ఈ రోడ్డు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను మరో రోడ్డుకు డైవర్ట్ చేశారు. ఇదే విషయం తెలుపుతూ ఎవరూ ఆ మార్గం వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.