ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ స్థానంలో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవో గా నియమింపబడ్డారు. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ట్విటర్‌ లో పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ సీఈవోగా ఎందుకు నియమించారో ట్వీట్‌లో పేర్కొన్నారు. “నేను 16 సంవత్సరాల పాటు వివిధ రంగాల లో సీఈవోగా, చైర్మన్‌గా ట్విట్టర్ కు పనిచేసాను అని, పరాగ్ అగర్వాల్ కంపెనీను, దాని అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్నారు అని డోర్సీ తెలియజేసారు. అంతే కాకుండా పరాగ్ అగర్వాల్ చిత్తశుద్ధితో నాయకత్వం వహిస్తారు అని, సీఈవోగా ఆయన రాణిస్తారని జాక్ డోర్సీ పేర్కొన్నారు. తన పదవీకాలం ముగిసేవరకు, కంపెనీ బోర్డులో కొనసాగుతానని ఆయన తెలియజేసారు. పరాగ్ అగర్వాల్ ను ట్విట్టర్ కంపెనీ బోర్డు సీఈవోగా ఏకగ్రీవంగా నియమించారు మరియు ట్విట్టర్ కంపెనీ తీసుకున్న కీలక నిర్ణయం వెనుక పరాగ్ ఉన్నారని డోర్సీ చెప్పారు.

దీనిపై పరాగ్ అగర్వాల్ ఎలా స్పందించారు ?
పరాగ్ అగర్వాల్.. జాక్ డోర్సీ కి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ స్నేహానికి కృతజ్ఞుడను. అలాగే మీ నిరంతర సలహాలు, సూచనలు పాటిస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకానికి భవిష్యత్‌ను ఆత్మవిశ్వాసంగా ఎదుర్కొనేలా మమ్మల్ని ప్రేరేపించిన టీమ్ అందరికీ నేను కృతజ్ఞుడిగా ఉంటా అని పరాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. నేను కంపెనీలో చేరినప్పటి నుండి ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్లు, విజయాలు, తప్పిదాలను చూశాను. కానీ, అప్పుడూ ఇప్పుడూ ట్విట్టర్ అద్భుత ప్రభావాన్ని చూపిస్తూ నిరంతర అభివృద్ధి దిశగా సాగుతూనే ఉంది” అని పరాగ్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ను మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచం గమనిస్తోంది, ప్రజలు అంతా విభిన్న దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారని అందుకే మన ట్విట్టర్ కంపెనీ యోక్క పూర్తి శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చూపెడదాం. రండి” అని ఆయన ట్వీట్ లో తెలియజేసారు .

పరాగ్ అగర్వాల్ యోక్క వివరాలు ?
పరాగ్ అగర్వాల్‌ భారత్‌లో జన్మించారు. 2011 అక్టోబర్‌లో పరాగ్, అడ్వర్టైజింగ్ ఇంజనీర్‌గా ట్విట్టర్లో చేరారు. తక్కువ కాలంలోనే ఆయన కంపెనీ ‘బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’గా ఎదిగారు. 2018లో ట్విటర్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత మరో 4 నెలల పాటు మైక్రోసాఫ్ట్‌లో పనిచేసి, ఏటీ&టీ ల్యాబ్స్‌కు మారారు. దీని తర్వాత ట్విట్టర్ లో ప్రయాణం ప్రారంభించారు.