దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 8.78 లక్షల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 33,750 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.49 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 123 మంది మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,81,893 కి చేరింది. గత 24 గంటల్లో 10వేల మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.42 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,45,582కి చేరింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ కేసుల మొత్తం సంఖ్య 1,700కి చేరింది. గత 24 గంటల వ్యధిలో 175 కొత్త కేసులొచ్చాయి.