రాష్ట్రంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ-2021) రెండో విడత ప్రవేశాల్లో 12,008 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో సెట్‌ కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో విడతలో వివిధ కోర్సుల్లో 47,925 పీజీ సీట్లకు 22,451మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకున్నారు. వారిలో 12,008 మందికి సీట్లు కేటాయించారు. ఈ సీట్లు పొందిన విద్యార్థులు బుధవారం (జనవరి 5) లోపు ఆయా కళాశాలల్లో టీసీని సమర్పించాలని కన్వీనర్‌ వెల్లడించారు.