తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 482 కొత్త కేసులు నమోదవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,82,971కి చేరింది. నిన్న కరోనా కారణంగా ఒకరు మృతి చెందడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి మొత్తం సంఖ్య 4,031కి చేరింది. గత 24 గంటల్లో 212 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో రిస్క్ జోన్ లో ఉన్న దేశాల నుండి 423 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయడంతో 23 మంది ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 84కి చేరింది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 37 మంది కోలుకున్నారు.

కేసుల వివరాలు..