హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ 1 జనవరి 2020 ప్రారంభించారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులు అందరు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఎగ్జిబిషన్ జరిగినన్ని రోజులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటలనుంచి 6 గంటల వరకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సందర్శకులు ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం చెప్పారు. ఇందులో ప్రవేశించాలంటే రుసుము రూ. 30 గా నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1500 స్టాళ్లకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 46 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహం 3గంటల వరకు సందర్శకులను వాహానాలతో అనుమతిస్తామని.. కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్రవాహనానికి రూ.100 రుసుముగా నిర్ణయించామని చెప్పారు. వాహానదారులు మైదానమంతా తిరుగుతూ వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.