దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో కళకళలాడాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,310.09 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమై ఆద్యంతం అదే జోరును కొనసాగించిన సూచీ 59,266.39 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 929.40 పాయింట్ల లాభంతో 59,183.22 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,387.15 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,646.65 – 17,383.30 మధ్య కదలాడి చివరకు 264.75 పాయింట్లు లాభపడి 17,618.80 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో హెచ్ డిఎఫ్ సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో ముగియాయి. టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ముగిసాయి.