కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో ఈరోజు తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో థియేటర్‌ పూర్తిగా తగలబడిపోయింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్‌ల సహయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రస్తుతానికి థియేటర్‌లో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా నడుస్తుంది. మంటల ధాటికి థియేటర్‌ స్క్రీన్, కుర్చీలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.