తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ఏడాది తరువాత టీఆర్‌ఎస్‌ పీడ వదులుతుందని తెలిపారు.

కాంగ్రెస్‌ నాయకులను ఇబ్బంది పెట్టే అధికారుల భరతం పడుతామని ఉత్తమ్ హెచ్చరించారు. ఇక 2023లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజుర్ నగర్, కోదాడ ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం మాఫియాలో మునిగితేలుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో హుజుర్ నగర్, కోదాడలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఉత్తమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కిందిస్థాయి కార్యకర్త నుంచి సీనియర్‌ నేతల వరకు అందరూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.