బెంగాల్ లో శనివారం ఒక్కరోజే 4,512కరోనా కేసులు నమోదవ్వగా వాటిలో 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దానితో సోమవారం నుండి బెంగాల్ లో పాఠశాలలను మూసివేయనున్నారు. ఇంకా అన్ని కార్యాలయాల్లో 50శాతం సిబ్బందితో మాత్రమే పని చేస్తాయి. స్కూల్స్ తో పాటు సినిమా థియేటర్స్, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్, బ్యూటీ సెలూన్ లను కూడా మూసివేయనున్నారు.