దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో మొదలై ఈ ఏడాదికి శుభారంభాన్ని ఇచ్చాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 360 పాయింట్ల లాభంతో 58,614 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 17,464 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, ఎల్‌అండ్‌టీ, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.