ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన జరుగుతోందని, దయచేసి జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు వినవించారు. ఇవాళ సాయంత్రం వారు అమిత్ షాను కలిసి ఏపీ వ్యవహారాలపై చర్చించారు. ఏపీలో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని ఆరోపించారు. ఆలయాలపై ప్రభుత్వమే దాడులు చేయిస్తోందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో మత మార్పిడులు జరుగుతున్నాయని ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లార…