క‌రోనా వ్యాక్సిన్ పంపిణీలో భార‌త్ రికార్డులు సృష్టిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల‌తో పోల్చితే ఆల‌స్యంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభించినా దూసుకెళుతోంది. తాజాగా భార‌త్ వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌లో మ‌రో రికార్డు సొంతం చేసుకుంది. అతిత‌క్కువ స‌మ‌యంలో 40 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ చేసిన దేశంగా భార‌త్ నిలిచింది. కేవ‌లం 18 రోజుల్లో దేశంలో 40 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేశారు.

18 రోజుల్లో దేశం మొత్తం మీద 41,38,918 మందికి క‌రోనా వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. మ‌‌న దేశంలో కేవ‌లం 18 రోజుల్లో 40 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయ‌గా, అమెరికాలో ఇందుకు గానూ 20 రోజులు స‌మ‌యం ప‌ట్టింది. యూకే, ఇజ్రాయిల్‌లో 39 రోజులు ప‌ట్టింది. కాగా, దేశంలో ఎక్కువ మందికి వ్యాక్సినేష‌న్ చేసిన రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉంది.

ఆ త‌ర్వాత స్థానాల్లో రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, ప‌శ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోనూ వేగంగా వ్యాక్సినేష‌న్ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 ల‌క్ష‌ల‌కు పైగా మందికి వ్యాక్సినేష‌న్ జ‌రిగింది.