టాప్ స్టోరీస్ (Top Stories)

రెండు రాష్ట్రాల్లో మారిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా విధానం

క‌రోనా ప్ర‌భావం చ‌దువుల‌పైన ఎక్కువ‌గా ప‌డింది. ఇంత‌కాలం ఆన్‌లైన్ క్లాసులు జ‌ర‌గ‌గా ఇప్పుడిప్పుడే పాఠ‌శాల‌లు తెరుచుకుంటున్నాయి. మ‌రోవైపు ప‌రీక్ష‌ల గ‌డువు కూడా స‌మీపిస్తోంది. ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష విధానంలో పూర్తిగా మార్పులు తేవాల‌ని ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. తెలంగాణ విష‌యానికి వ‌స్తే… ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు 11 పేప‌ర్లుగా జ‌రిగేవి. ఈసారి మాత్రం కేవ‌లం ఆరు పేప‌ర్లుగానే నిర్వ‌హించాల‌ని తెలంగాణ విద్యా శాఖ నిర్ణ‌యించింది.

గ‌తంలో సెకండ్ లాంగ్వేజ్ మిన‌హా అన్ని స‌బ్జెక్ట్‌లలో రెండు పేప‌ర్ల‌తో ప‌రీక్ష‌లు జ‌రిగేవి. ఇప్పుడు అన్ని స‌బ్జెక్టుల‌కూ ఒకే పేప‌ర్‌తో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష స‌మయాన్ని కూడా పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు 2.45 గంట‌ల పాటు ప‌రీక్ష ఉండేది. ఈసారి 3.15 గంట‌లు ప‌రీక్ష ఉంటుంది. విద్యార్థుల‌కు ప‌రీక్షాప‌త్రంలో చాయిస్‌లు కూడా ఎక్కువ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

మ‌రోవైపు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే పేప‌ర్ల సంఖ్య‌ను ఏడుకు కుదించారు. ఇప్పుడు ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా విడుద‌ల చేశారు. జూన్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించనున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్ర‌క‌టించారు. ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.