స్పోర్ట్స్ (Sports)

గ‌చ్చిబౌలి దివాక‌ర్‌ను తీసుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కొత్త క్రికెట‌ర్‌ను ఎంపిక చేసుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆ జ‌ట్టు స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది. మ‌న తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌స్తుడైన గ‌చ్చిబౌలి దివాక‌ర్‌ను ఐపీఎల్ 2021 వేలంలో తీసుకునేందుకు సెలెక్ట్ చేసుకున్న‌ట్లు ఒక ట్వీట్ చేసింది. అన్న‌ట్లు.. గ‌చ్చిబౌలి దివాక‌ర్ అంటే తెలుసు క‌దా..? అదేనండి.. మ‌న బ్ర‌హ్మానందం.! కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం సినిమాలో బ్ర‌హ్మానందం వేసిన ఈ పాత్ర బాగా ఫేమ‌స్.

ఇప్పుడు ఐపీఎల్ ఎలాగూ లేదు కాబ‌ట్టి ఫ్యాన్స్‌కు కొంత వినోదం అందించేందుకు రాయ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఒక ట్వీట్ చేసింది. బాలీవుడ్‌లో క్రికెట్ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లోని న‌లుగురు రీల్ క్రికెట‌ర్ల ఫోటోల‌ను పెట్టి, 2021 వేలంలో ఎవ‌రిని కొనాలో చెప్పండ‌ని ఫ్యాన్స్‌కు ఓ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్ అడిగింది. దీనికి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు స్పందించింది. తాము కొనాలనుకుంటున్న ఆట‌గాడిని ఎంపిక చేసుకున్నామ‌ని చెబుతూ, గ‌చ్చిబౌలి దివాక‌ర్ జిఫ్ ఇమేజ్‌ను ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో మ‌న గ‌చ్చిబౌలి దివాక‌ర్ కాస్తా ఇండియా వైడ్ ఫేమ‌స్ అయ్యేలా ఉన్నాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.