సూర్యాపేట పట్టణంలోని శ్రీశ్రీ నగర్‌లో రోడ్డు పక్కనే ఒక గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఆమె వివరాలు ఇంకా తెలియరాలేదు.ఆమె అనాధ? లేక ఏదైనా పని కోసం పట్టణానికి వచ్చిందో తెలియదు కానీ రోడ్డు మీద ఆమె మృతి చెందింది. ఆమె పక్కనే నాలుగేళ్ల కూతురు కూడా ఉంది.

తన తల్లి చనిపోయిందన్న విషయం అర్ధం కాని వయసు ఆ చిన్నారిది . దానితో తన తల్లి బ్రతికే ఉందనుకుని తలలో పేలు చూడడం, మృతదేహంపై ఉన్న దుప్పటి సరిచేయడం వంటి పనులు చేయడం చూపరులను సైతం కంటతడి పెట్టించాయి.