బ్రెజిల్‌లో తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు, అక్కడ మరణాలు గతేడాది మార్చి నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. కరోనా వైరస్‌ మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,641 మంది మృతి చెందటమే అందుకు నిదర్శనం.
అక్కడి ప్రభుత్వం మంగళవారం వైరస్‌ వ్యాప్తి తీవ్రమైనట్లు ప్రకటించింది. ఈమధ్యలో ఆ దేశంలో పలు వేడుకలు జరగడమే దీనికి కారణం అని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలో 20 రాష్ట్రాల్లో అన్ని ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయిన కారణంగా, పరిస్థితి మరింత విషమించకుండా దేశంలో కర్ఫ్యూ విధించాలి అని జాతీయ ఆరోగ్య కార్యదర్శులు పిలుపునిచ్చారు. బ్రెజిల్‌లో కొవిడ్‌ ప్రారంభమైన తర్వాత ఇప్పటికి మొత్తం 2.57లక్షల మంది దాకా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉండగా రెండవ స్థానంలో బ్రెజిల్ ఉంది.
బ్రెజిల్లో ‌వ్యాక్సినేషన్ జనవరిలో నే ప్రారంభించి ఈ ఏడాది కల్లా అందరికి టీకా అందించే ప్రయత్నంలో ఉంది.