దాచేపల్లి ప్రైవేట్ హాస్పిటల్స్ గురించిన ఘటన చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన తేలుకుట్ల మల్లయ్య యాదవ్ అనే వ్యక్తి గత నెల 18 వ తారీకు ఫ్యాక్టరీల దుమ్ము , దూళికి పంట నష్టపోయి
పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దాంతో బందువులు మల్లయ్య యాదవ్ ను హుటాహుటిన స్తానిక క్రాంతినర్సింగ్ హొమ్ లో చేర్పించారు. కానీ అప్పటికే మృతి చెందిన మల్లయ్య యాదవ్ కు కొన్ని గంటల పాటు ట్రీట్మెంట్ చేసిన అనంతరం ఆయన చనిపోయారు కాబట్టి బిల్లు కౌంటర్ లో కట్టి శవాన్ని తీసుకెళ్ళమని డాక్టర్ విక్రాంత్ వచ్చి చెప్పారు. దానితో ఆగ్రహం చెందిన బంధువులు డాక్టర్ విక్రాంత్ ఉన్న రూమ్ తలుపులు బద్దలు కొట్టి చితకబాదారు.

దాచేపల్లి హాస్పిటల్స్ లో జరిగే దోపిడీలకు స్తానికులు బెంబేలెత్తుతున్నారు. పురుటినొప్పులతో హాస్పిటల్స్ కు వస్తే బిడ్డ అడ్డం తిరిగిందంటూ ఆపరేషన్లు చేయడం, ప్రత్యేక ప్యాకేజీతో మగబిడ్డా , ఆడబిడ్డా స్కానింగ్ తీసి చెప్పటంతో పాటు, అబార్షన్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.