మృతి చెందాడని భావించి వైద్యులు పోస్టుమార్టంకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వ్యక్తి మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. ఆగిపోయిందనుకున్న ఆయన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలయింది. ఈ సంఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా మహాలింగపురలో ఫిబ్రవరి 27వ తేదీన జరిగింది. శంకర్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుండి మహాలింగపుర ప్రభుత్వ ఆస్పత్రికు మార్చారు. అక్కడి వైద్యులు శంకర్ మృతి చెందారని నిర్ధారించి పోస్టుమార్టం కోసం సిద్ధమవుతుండగా అతని కాళ్ళ కదలికను గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.వెంటనే బంధువులు అతనిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.