హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులను ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం పాఠకులకు విదితమే! దంపతుల హత్య కేసుకు సంబంధించి బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు మంథని తీసుకెళ్లి హత్యకు ముందు రెక్కీ చేసిన ప్రాంతాల్లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌‌ నిర్వహించారు. హత్యకు ముందు నిందితులు రెక్కీ నిర్వహించిన మంథని కోర్టు ప్రాంగణం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, అంబేడ్కర్‌ చౌక్‌లో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించి అనంతరం నిందితులను హత్య జరిగిన కల్వచర్లకు తీసుకెళ్ళగా హత్య జరిగిన తీరును కుంట శ్రీను, కుమార్, చిరంజీవి పోలీసులకు వివరించారు.