తెలంగాణలో మళ్ళీ పరీక్షల సందడి మొదలవ్వనుందా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఆగస్టులో ఐసెట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుండి ప్రకటన విడుదలయ్యింది. ఏప్రిల్ 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం, ఆలస్య రుసుంతో జులై 30వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఆగస్టులో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 14 పట్టణాల్లో ఐసెట్ పరీక్ష జరగనున్నట్టు సమాచారం.