ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ గత మార్చిలో ఇచ్చిన పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడం వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు తిరిగి నామినేషన్లు పలుచోట్ల దాఖలు చేసేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుమతించిన విషయం తెలిసిందే! దీంతో నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించి, గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఎస్‌ఈసీ నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎస్‌ఈసీకు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది.