సీనియర్ హీరో వెంకటేష్‌ ఎంతో వేగంగా సినిమాలను కంప్లీట్ చేస్తారు. ఒక దాని తర్వాత ఒకటి వరుసగా కొత్త సినిమాలను మొదలుపెడుతుంటారు. ఓ పక్క నారప్ప ఎఫ్‌3 షూట్‌ లో పాల్గొంటూనే మరో పక్క దృశ్యం2 సినిమాని పట్టాలెక్కించాడు.

తాజాగా వెంకటేష్‌ దృశ్యం సినిమాకు సీక్వెల్ అయిన దృశ్యం 2 సినిమాకు కొబ్బరి కాయ కొట్టేశారు. అయితే దృశ్యం1 సినిమాకు శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మళయాల డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని రీసెంట్ గా హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 5 నుంచి రెగ్యులర్గా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకోనున్నట్టు చిత్రబృందం తెలిపింది.

అయితే ఇటీవల మలయాళంలో రిలీజైన దృశ్యం2 సినిమా అందరినీ ఆకట్టుకుని వన్‌ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ సినిమాగా అందరి మన్ననలు పొందుతుంది. దీంతో వెంటనే తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేసి ప్రేక్షకులకు చూపించాలని వెంకటేష్ భావించారు. వెంటనే దృశ్యం2కు వెంకటేష్. మొదటి సినిమాలో నటించిన నటీనటులే ఈ సినిమాలో కూడా నటించనున్నారు. ఇక ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.