గత ఆదివారం రాజధాని హనోయ్‌లో ఓ ప్యాకేజీని డెలివరీ చేయడం కోసం వియాత్నంకు చెందిన న్గుయెన్ న్గోక్ మన్హ్(31) ట్రక్కులో కూర్చొని వెయిట్‌ చేస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మన్హ్‌కు చిన్నారి ఏడుపు వినిపించింది. ఎక్కడో పిల్లలు ఆడుకుంటున్నారని భావించాడు మన్హ్‌. ఈలోపు చుట్టు పక్కల ఉన్న వారు కూడా గట్టిగట్టిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని ట్రక్కు కిటికి తెరిచి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు మన్హ్‌. రెండేళ్ల చిన్నారి ఒకరు 12వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడం, అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న గోడ మీద పడి వేలాడుతూ ఉండడం గమనించి
వెంటనే అప్రమత్తమై ఎంతో చాకచక్యంగా చిన్నారిని ఒడిసి పట్టుకుని ఆ బాలికను ఆమె తల్లితండ్రులకు అప్పగించారు. ఆ చిన్నారి తండ్రి కూడా ఆమెను కాపాడడానికి అపార్ట్మెంట్ పక్కనే ఉన్న గోడ దూకి బిడ్డను కాపాడాలని ప్రయత్నించేలోపు, ఆ చిన్నారి వేలాడుతున్న గోడ పక్కనే మన్హ్‌ ట్రక్కులో కూర్చొని ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా గాయాలు ఏమి కాలేదు కానీ నడుము కొంచెం పక్కకు జరిగిందని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్యం అందిస్తున్నారు.