మంగళవారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 40,444 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే మొత్తం 168 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,99,254కి చేరింది. దీనిని ధ్రువపరుస్తూ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఎవరూ మృతిచెందకపోవడం కొంచం ఊరట కలిగించే అంశం. కరోనా బారి నుంచి నిన్న కోలుకున్నవారి సంఖ్య 163 కాగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2,95,707కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,912 ఉండగా, వీరిలో 796 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 88,01,651కి చేరింది.