ఒరిస్సా రాష్ట్రం పార్లకేముండి గణపతి జిల్లా పరసంబా గ్రామానికి చెందిన నిమియా సబర్(25) సర్వేపల్లిలోని ఎన్ఎన్జే బీర్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నారు. సర్వేపల్లిలోని ఎస్ఎన్జే బీర్ ఫ్యాక్టరీలో నిమియా సబర్, అతని గ్రామానికి చెందిన కొందరు బీర్ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా తోటి కూలీలతో వివాదాలు జరుగుతుండడంతో నిమియా సబర్ మనస్తాపానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం కూడా కూలీలు నిమియా సబర్‌ను అవమానపరచడంతో ఫ్యాక్టరీ క్వార్టర్స్ వెనుక ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయించి కేసు నమోదు చేస్తున్నారు.