హర్యానాలోని గుర్గావ్‌లోని నాధూపురలోని మురికివాడలో ఒక ఇంట్లోనుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్రమంగా పక్కనే పూరిగుడిసెలకు కూడా వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఏడు వందలకుపైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంటా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.