క్రైమ్ (Crime) వార్తలు (News)

యూపీలో బీజేపీ నేత బ్రజేష్ సింగ్ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పరిధిలో గల నారాయణ పూర్‌లో బీజేపీ నేత బ్రజేష్ సింగ్ హత్యకు గురయ్యారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాధ్యక్షుని పదవికి పోటీ చేస్తున్న తరుణంలో ఈయన హత్య స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఆయన పట్టణంలోని తన ఇంటి నుంచి గ్రామానికి తిరిగివస్తుండగా గ్రామం వెలుపల తుపాకీతో కాల్చి చంపారు. తన నామినేషన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

హత్య అనంతరం బ్రజేష్ సింగ్ మృతదేహాన్ని గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించగా అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఈ హత్యపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ పోలీసు బలగాలతో సహా ఆసుపత్రికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.