కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన బెంగుళూరు అర్బన్‌లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం కర్ణాటకలో 34,238 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా గత 24 గంటల్లో ఆరుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా విజృంభిస్తుండడంతో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.