తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 59,705 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,078 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఆరుగురు మృతి చెందడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1712కి చేరింది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 6,900గా ఉన్నాయి. నిన్న 330 మంది కరోనా నుంచి కోలుకున్నారు మరియు 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.