వార్తలు (News)

అవయవ దానానికి సిద్దమైన జీవన్మృతుడి కుటుంబం

మహబూబ్‌నగర్‌ మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన జాజిలి కృష్ణయ్య కుమారుడు జాజిలి రాములు (24) మేస్త్రీ పనిచేసుకొంటూ జీవనం సాగించేవారు. ఆయనకు ఏడాది కిందటే వివాహం కాగా భార్య రాధిక అలియాస్‌ అరుణ ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. గత శనివారం రాములు అనారోగ్యానికి గురికావడంతో జనరల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగైదు రోజుల నుంచి చికిత్స అందిస్తున్నా కూడా అతడి శరీరం వైద్యానికి సహకరించడం లేదని, నాళాల్లో రక్తం గడ్డకట్టుకొని పోవడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి అవయవాలు దానం చేస్తే పలువురి ప్రాణాలను నిలబెట్టినట్లు అవుతుందని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు అవయవ దానికి అంగీకరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.