ఎయిర్‌ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగా ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఆమె లో దుస్తుల్లో బంగారం పేస్టును రెండు ఉండలను గుర్తించారు. 548 గ్రాముల బరువు గల బంగారం విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి జి–9541 విమానంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేయగా అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకెళుతూ పట్టుబడ్డాడు. అతడి బ్యాగేజీలో భారత కరెన్సీలో రూ.8.4 లక్షల విలువ చేసే యూఎస్, ఒమన్, యుఏఈ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.