జాతీయం (National) వార్తలు (News)

ప్రమాదం నుండి తప్పించుకున్న ఇండిగో విమానం

లక్నో నుండి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానం బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో, 11,000 అడుగుల ఎత్తులో ఉండగా ఇండిగో ఫ్లైట్ 6ఈ-6654 క్యాబిన్‌లో డిప్రెజరైజేషన్‌కు గురి కావడంతో ఇబ్బంది ఎదురైంది. కానీ పైలట్‌, సిబ్బంది అప్రమత్తతతో విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ పరిస్థితి తలెత్తిన వెంటనే విమాన సిబ్బంది అత్యవసర ప్రమాద సంకేతం మేడేను ప్రకటించి వెంటనే ప్రయాణీకులకు ఆక్సిజన్‌ మాస్క్‌లు అందించారు. అనంతరం బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విమాన లాండింగ్‌ క్లియరెన్స్ కు వారి అనుమతి తీసుకుని విమానాన్ని సురకక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ విమానాన్ని బెంగళూరు సాంకేతిక బృందం తనిఖీ చేస్తోంది. అలాగే ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.