టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఐసెట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన మహేందర్‌రెడ్డి

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఏప్రిల్ నెల 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే రూ. 250 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. పరీక్షను ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించి సెప్టెంబరు 17న ఫలితాలు విడుదల చేస్తామని వివరించారు. ఐసెట్‌ నిర్వహణ కోసం ఇప్పటికే 60 కేంద్రాలను గుర్తించినట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 14 రీజినల్‌ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.