అంతర్జాతీయం (International) వార్తలు (News)

మనసు దోచిన మాస్కో వైద్యులు..

రష్యాలో బ్లాగోవెష్‌చెన్స్క్‌లోని టిసారిస్ట్-ఎరా ఆసుపత్రి లో ఒక రోగికి అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో ఆసుపత్రి మంటల్లో చిక్కుకుంది. అయినప్పటికీ వైద్యులు మాత్రం ఏమాత్రం భయపడకుండా, గందరగోళానికి తావివ్వకుండా ఆపరేషన్‌ను పూర్తి చేసి రోగి ప్రాణాలు కాపాడి అక్కడివారి ప్రసంశలు అందుకున్నారు.అసలేం జరిగింది.. బ్లాగోవెష్‌చెన్స్క్‌లోని టిసారిస్ట్-ఎరా ఆసుపత్రి రూఫ్‌పై ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో 8 మంది వైద్యులు వారికీ సహాయంగా ఒక నర్స్ ఒక రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు.

మరోవైపు, అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లోనే ఆసుపత్రి వద్దకు చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో ఆసుపత్రిలో క్లిష్టతరమైన ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా తమ వంతుగా పెద్దపెద్ద ఫ్యాన్లు పెట్టి పొగ అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడి విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమయంలో రోగి ప్రాణాలు కాపాడడం తప్ప తమ ముందు మరో మార్గం లేదని సర్జన్ వేలెంటిన్ ఫిలతోవ్ పేర్కొన్నారు. అది హార్ట్ బైపాస్ ఆపరేషన్ అని ఆయన తెలిపారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా తప్పించుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.