కువైట్‌లో రంజాన్ సీజన్ కంటే ముందే 10 లక్షల మందికి టీకా ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఆ దేశ పౌరులు, నివాసితులకు వ్యాక్సినేషన్ పూర్తైన వెంటనే ఎయిర్‌పోర్టును తెరిచే యోచనలో అధికారులు ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ఆరోగ్యశాఖ వీలైనంత త్వరగా టీకా ప్రక్రియను పూర్తి చేయాలని తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో కువైట్ వివిధ కంపెనీల టీకాలను కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తోంది.