టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో 99.04% ఉత్తీర్ణత!!

సెంట్రోల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి పాఠకులకు విదితమే! అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 99.04శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గమనార్హం!

అత్యధికంగా త్రివేంద్రం(కేరళ)లో 99.99శాతం, ఆ తర్వాత బెంగళూరు(కర్ణాటక)లో 99.96శాతం ఉత్తీర్ణత నమోదు కాగా బాలుర కంటే బాలికలు 0.35శాతం మేర అధికంగా ఉత్తీర్ణత సాధించారు. కేంద్రీయ విద్యాలయాల్లో 100శాతం విద్యార్థులు పాసవ్వగా.. జేఎన్‌వీల్లో 99.99శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం 20,97,128 మంది విద్యార్థుల ఫలితాలను వెల్లడిస్తే అందులో 57,824 మంది 95శాతానికి పైగా మార్కులు సాధించగా, 2,00,962 మంది విద్యార్థులు 90 నుంచి 95శాతం మార్కులు సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలు వెయిటింగ్‌లో ఉన్నాయి. వారి గ్రేడ్లను కూడా త్వరలోనే వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. కంపార్ట్‌మెంట్‌ కింద 17,636 మంది విద్యార్థులు ఉండడంతో వీరికి ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 మధ్య కంపార్ట్‌మెంట్‌పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •