ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

బూస్టర్ డోసుతో కొత్త వేరియంట్ లకు అడ్డుకట్ట వేయొచ్చా??

కరోనా వ్యాపిస్తున్న కొద్ది కొన్ని వేరియంట్లు వల్ల ప్రమాదకరంగా మారుతున్నాయి. టీకా తీసుకున్న వారు కూడా మహమ్మారికి చిక్కడంతో వ్యాక్సిన్ ద్వారా వచ్చే రోగనిరోధక శక్తి తో వైరస్ నుంచి రక్షణ పొందలేమనే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో బూస్టర్ డోస్ ఆవశ్యకతపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన మైక్రో బయాలజిస్ట్ బూస్టర్ డోస్ ఉపయోగాలను వివరించారు .

బూస్టర్ డోస్ అంటే ఏంటి? మన శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఏ వ్యాక్సిన్ వల్ల లభించిన ఇమ్యూనిటీ కైనా ఇదే వర్తిస్తుండడంతో రోగనిరోధకశక్తిని కొనసాగించేందుకు రెండు డోసులు తీసుకున్నవారికి అదనంగా మరో డోసు ఇవ్వడంతో వైరస్ మార్పులకు అనుగుణంగా సమర్థవంతంగా కొత్త వేరియంట్లను అడ్డుకునేలా తయారుచేస్తారు

ఇది ఎవరికి అవసరం అంటే 80 ఏళ్లు దాటిన వారికి యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయి కాబట్టి వీరిలో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులకు బూస్టర్ డోస్ ఇవ్వాలి. అలాగే అవయవ మార్పిడి బాధితుల్లో కోవిడ్ యాంటీ బాడీలు ఉత్పత్తి కావడం లేదు దీంతో ఫ్రాన్స్ కు చెందిన టీకా నియంత్రణ సంస్థ అవయవ మార్పిడి బాధితులకు బూస్టర్ డోస్ ఇవ్వాలని సిఫారసు చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •